సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (18:49 IST)

13-09-2020 నుంచి 19-09-2020 వరకు మీ వార రాశి ఫలితాలు - video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక, 1వ పాదం
పంతాలు భేషజాలకు పోవద్దు, లౌక్యంగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. మితంగా సంభాషించండి. రావలసిన ధనం అందక ఇబ్బందులెదుర్కొంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గురు,శుక్ర వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ అసక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. వ్యాపకాలు సృష్టించుకోండి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ద అవసరం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2 పాదాలు
ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఖర్చులు అధికం. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. శనివారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. శ్రీవారు లేక శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ విషయాలపై శ్రద్ద వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చిరువ్యాపారాలకు కష్ట కాలం. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. ఏజెన్సీలు, స్టాక్ మార్కెట్ రంగాలవారికి ఆశాజనకం.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి కలిసొచ్చే సమయం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడుతాయి. ఆది, సోమ వారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆపన్నులకు సాయం అందిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఏజెన్సీలు దళారులను విశ్వశించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్ద మొత్తం సరకులు నిల్వ తగదు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. కార్మికులు, చేతివృత్తుల వారికి నిరాశాజనకం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో సంబంధాలు బలపడుతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. రోజువారి ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. సంస్థల స్థాపనలకు సమయం కాదు. పనులు చురుకుగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహ మార్పు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్ద మొత్త సహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబీకుల ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రకటనలను, ఫోన్ సందేశాలు విశ్వసించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆలోచనల్లో మార్పు వస్తుంది. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పరిచయాలు బలపడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బందులుండవు. శనివారం నాడు చెల్లింపులో జాగ్రత్త. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతుల మధ్య అరమరికలు తగవు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ఉపాధి పథకాలపై దృష్టి పెడతారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూలతలున్నాయి. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. మీదైన రంగంలో రాణిస్తారు. పరిచయస్తుల సహాయం అందుతుంది. ఖర్చులు సామాన్యం. వ్యాపకాలు అధికమవుతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఆది, సోమ వారాల్లో వ్యవహారాలతో తీరిక ఉండదు. పనులు హడావిడిగా సాగుతాయి. మీ శ్రీమతి విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అతిగా ఆలోచించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతోంది. వ్యాపారాలలో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. వైద్య, న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. విమర్శలు పట్టించుకోవద్దు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధ వారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఎవరినీ తక్కువ అంచనా వెయ్యొద్దు. సంతానం, చదువులపై దృష్టి పెడతారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం, వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. రావలసిన ఆదాయం అందుతుంది. రుణ సమస్యల నుండి బయటపడుతారు. గృహ మార్పు కలిసివస్తుంది. వేడుకలకు యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సంస్థల స్థాపనకు సమయం కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. గురు, శుక్ర వారాల్లో అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్ విషయంలో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కార్మికులు, చేతి వృత్తుల వారికి నిరుత్సాహకరం. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి. బాధ్యతగా వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వద్దు. ప్రత్యర్థుల కదలికను ఓ కంట కనిపెట్టండి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు లోటుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి. శ్రమ అధికం. సంస్థల స్థాపనలకు అనుకూలం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. సంతానం, భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. దైవ కార్య సమావేశంలో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతను అధికమిస్తారు. మీ వాక్కు ఫలిస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. ఉల్లాసంగా గడుపుతారు. ప్రభుత్వ కార్యాలయాలల్లో పనులు సానుకూలమవుతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింప జేస్తుంది. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు సామాన్యం. పొదుపు ధనం అందుతుంది. సంప్రదింపులు వాయిదా పడుతాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. సాధ్యం కాని హామీలివ్వద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయదు. ఉద్యోగస్తులకు శుభయోగం, పురస్కారాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. శ్రమించినా ఫలితం ఉండదు. ఊహించని ఖర్చులు, ధన నష్టం ఎదుర్కొంటారు. మనో నిబ్బరంతో వ్యవహరించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పనుల్లో ఒత్తిడి అధికం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకోండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకుంటాయి. గృహమార్పు కలిసివస్తుంది. అనవసర జోక్యం తగదు. లైసెన్సుల రెన్యువల్లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారాలకు కష్టకాలం, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు బాధ్యతల మార్పు. మార్కెట్టు రంగాల వారికి ఒత్తిడి అధికం. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రయాణం తలపెడతారు. జూదాలు, పందాల జోలికి పోవద్దు.