తెలుపు పంచదారలో మంచిదా..? తాటిబెల్లం మంచిదా..?
sugar
ఇలాంటి చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం వలన ఊబకాయం, తద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు సంక్రమిస్తాయి. చక్కెరల వల్ల క్యాన్సర్ వచ్చేందుకు కూడా అవకాశాలుంటాయి. శుద్ధి చేసిన చక్కెరల కంటే పండ్లు, పాల నుంచి పొందే చక్కెర శరీరానికి చాలా మంచిది.
పండ్లలో స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీలలో చక్కెర చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అరటి, మామిడి పండ్లలో, డ్రైఫ్రూట్స్‌లో చక్కెర కొంచెం ఎక్కువగా ఉంటుంది. పళ్ల రసాల్లో చక్కెర అధికంగా ఉంటుంది. కనుక రసాల కన్నా పూర్తిగా పండును తినేయడమే ఉత్తమం.
తెల్లచక్కెరను దేనిలో కలుపుకుని తిన్నా కడుపు నిండుగా అనిపించదు. ఎన్ని కేలరీలు లోపలికి వెళ్లినా ఏమీ తెలియదు. అలా తింటూనే ఉంటాం. అదే సమస్య. ఊబకాయం వచ్చేది అందుకే. పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లోని చక్కెర మంచిదే. తెల్ల చక్కెర మాత్రం ఎంత దూరం పెడితే అంత మంచిదని పోషకాహార నిపుణుల మాట.
