1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. These are enough to keep you healthy and beautiful

ఆరోగ్యంగా, అందంగా వుండేందుకు ఇవి తీసుకుంటే చాలు...

healthy food
రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది.
 
ఎక్కువుగా పండ్ల రసాలను తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు.
 
తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.
 
కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్ధన చేసుకోవాలి.
 
కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనపడుతుంది.
 
టీ స్పూన్ కీరా జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
బొప్పాయి, అరటి, జామ, ఆపిల్ వంటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి.
 
ఎక్కువసార్లు మంచినీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి.
 
నిమ్మ, ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.
 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
జామ ఆకులు: స్త్రీలకు ఇలా పురుషులకు అలా మేలు చేస్తాయి