శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:52 IST)

దూకుడుమీదున్న రిషబ్... స్ట్రోక్ ప్లేతో మోడల్ బ్యూటీతో డేటింగ్!

భారత క్రికెట్ జట్టు క్రికెటర్ రిషబ్ పంత్ మంచి దూకుడుమీదున్నాడు. అటు మైదానంలో తన సత్తా చూపిస్తున్నాడు. బ్యాటింగ్‌లో రాణిస్తూ వికెట్ల వెనుక అద్భుతంగా కీపింగ్ చేస్తున్నాడు. అదేసమయంలో తన ప్రియురాలితో డేటింగ్‌లో కూడా నిమగ్నమైవున్నాడు. 
 
స్ట్రోక్ ప్లేతో కేక పుట్టిస్తున్న ఈ ఢిల్లీ ప్లేయ‌ర్ ఇప్పుడు త‌న డేటింగ్ పార్ట్‌నర్‌కు కూడా థ్రిల్ పుట్టిస్తున్నాడు. ఇన్నాళ్లూ బాలీవుడ్ బేబీ ఊర్వ‌శీ రౌతేలాతో డేటింగ్ చేసిన పంత్ ఇప్పుడు కొత్త అమ్మాయితో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. 
 
నిజానికి ఊర్వ‌శితో ఉన్న రిలేష‌న్‌ను ప‌బ్లిక్ చేయ‌క‌ముందే ఆ ఇద్ద‌రూ విడిపోయారు. 2018లో రౌతేలా భామ‌తో చ‌క్క‌ర్లు కొట్టిన రిష‌బ్ ఇప్పుడు మ‌రో మోడ‌ల్ ఇషా నేగితో డేటింగ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఊర్వ‌శి రౌతేలా వ్యాట్సాప్‌ను బ్లాక్ చేసిన పంత్‌.. నేగితో దిగిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాలో పెట్టేశాడు. ఇషా నేగిని ఎంత ఇష్ట‌ప‌డుతున్నాడో కూడా ఆ పోస్టులో క్లియ‌ర్‌గా చెప్పేశాడు. 
 
"నిన్ను నేనెప్పుడూ హ్యాపిగా ఉంచాల‌నుకుంటున్నా.. ఎందుకంటే నేను హ్యాపిగా ఉండ‌డానికి నువ్వే రీజ‌న్" అంటూ త‌న పోస్టులో రాశాడు. ఇషా నేగి కూడా రిష‌బ్‌తో దిగిన ఫోటోను త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది. 
 
"నువ్వే నా మ‌గాడివి, నువ్వే నా ఆత్మ‌వి, నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, నా జీవితానికి నువ్వే ప్రేమ‌వ‌ని" ఆమె త‌న పోస్టులో రాసింది. ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అయిన ఇశా నేగి.. డెహ్రాడూన్‌లో బీఏ ఇంగ్లీష్ హాన‌ర్స్ చ‌దివింది.