ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 మార్చి 2021 (13:56 IST)

అర్థరాత్రి 500 క్యాలరీలు ఖర్చు చేశాడని తెలిసి బ్రేకప్ చెప్పిన ప్రేయసి, ఏం జరిగింది?

శరీరంలో క్యాలరీలు ఎంత ఖర్చవుతున్నాయనే లెక్కలు ఈమధ్య యువత చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇందుకోసం స్మార్ట్ వాచీలను వాడుతోంది. దాని ద్వారా తాము ఎంత పని చేశాము, ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయని లెక్క తేలుతుంది. దీని ద్వారా శరీరాన్ని సమతుల్యం చేసుకునే వీలు కలుగుతుంది.
 
ఐతే ఇదే స్మార్ట్ వాచ్ ఓ ప్రియుడిని అడ్డంగా బుక్ చేసింది. తన ప్రేయసితో కాకుండా మరో యువతితో అతడు చేసిన రొమాన్స్ కారణంగా అతడి శరీరంలో క్యాలరీలు ఖర్చవడాన్ని పట్టించింది.
 
వివరాల్లోకి వెళితే... నదియా ఎసెక్స్ అనే టిక్ టాక్ యూజర్ ఓ యువకుడిని ప్రేమించింది. అతడే లోకంగా వుంటోంది. ఈమధ్య ఇద్దరూ కలిసి ఫిట్నెస్ కోసం ఫిట్ బిట్ అనే స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసారు. అప్పటి నుంచి ఇద్దరూ వాటిని ధరిస్తూ వస్తున్నారు. పైగా ఇద్దరి వాచీలను ఒకదానికొకటి అనుసంధానించుకున్నారు. దీనితో ఒకరి సమాచారం ఇంకొకరికి తెలుస్తుంది.
 
ఐతే ఓ రోజు నిద్ర లేచి చూసిన ప్రేయసి షాక్ అయ్యింది. తన ప్రియుడు అర్థరాత్రి సమయంలో 500 క్యాలరీలు ఖర్చు చేయడాన్ని గమనించింది. అతడు అర్థరాత్రివేళ అంతమేర ఖర్చు చేసేంత పని ఏం చేశాడా అని ఆరా తీస్తే అతడు మరో యువతితో శృంగారం చేశాడని తెలుసుకుంది. అందువల్ల ఆ మేరకు క్యాలరీలు ఖర్చయ్యాయని తెలుసుకుని అతడికి బ్రేకప్ చెప్పేసింది. స్మార్ట్ వాచ్ ఎంత పని చేసిందని ప్రియుడు షాక్ తిన్నాడట.