సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (10:26 IST)

వాడిని చేసుకోవడం ఇష్టంలేదు.. చంపేయ్... ప్రియుడికి ప్రియురాలి ఆదేశం..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రియురాలి మాట విన్న ప్రియుడు చిక్కుల్లో పడ్డాడు. తనకు కాబోయే భర్తను చంపాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో ఆ వ్యక్తిని ప్రియుడు చంపేశాడు. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని మోహన్‌లాల్‌గంజ్‌కు చెందిన షానే అలి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే సదరు యువతి కుటుంబం ఆమెకు బంథ్రకు చెందిన షాహబుద్దిన్‌తో వివాహం నిశ్చయించింది. ఈ పెళ్లి ఇష్టం లేని యువతి షాహబుద్దిన్‌ అడ్డుతొలగించమని ప్రియుడ్ని కోరింది. దీంతో షానే అలి, షాహబుద్దిన్‌ను చంపటానికి పథకం వేశాడు.
 
ఈ నెల 11వ తేదీన యువతి బర్త్‌డే పార్టీలో పాల్గొనటానికి వచ్చిన అతడ్ని స్నేహితుల సహాయంతో పొడిచి, కుక్క బెల్టుతో మెడ బిగించి చంపేశాడు. అనంతరం బాబు ఖెర గ్రామంలో మృత దేహాన్ని పడేశాడు. 
 
పోలీసులు షాహబుద్దిన్‌ హత్యకు సంబంధించి యువతిని విచారించారు. మొదట తనకేమీ తెలియదని బుకాయించినప్పటికి, తర్వాత తన ప్రియుడే మృతుడ్ని చంపేసినట్లు వెల్లడించింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.