శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వెజ్ పిజ్జా డెలివరీ చేస్తే అది ఇచ్చారనీ రూ.కోటికి దావా వేసిన మహిళ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అమెరికాకు చెందిన రెస్టారెంట్‌ ఔట్‌లెట్‌పై కోటి రూపాయల నష్టపరిహారానికి దావా వేసింది. పుట్టగొడుగుల పిజ్జాను ఆర్డర్‌ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేశారన్న ఆమె ప్రధాన ఆరోపణ. ఈ మేరకు ఆమె వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌కు చెందిన దీపాళీ త్యాగి అనే మహిళ 2019, మార్చి 21న సదరు ఔట్‌లెట్‌ నుంచి శాకాహార పిజ్జాను ఆర్డర్‌ చేసింది. అయితే ‘‘చెప్పిన సమయం కంటే అరగంట ఆలస్యంగా పిజ్జాను డెలివరీ చేశారు. మాంసాహార పిజ్జాను ఇవ్వడంతో రుచి చూశాక బిత్తరపోయాం. దాన్ని తినడం వల్ల మా మతపర మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
ఈ అపరాధ భావన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది. పరిహార పూజల నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలా ఎందుకు చేశారని అడిగితే... సదరు ఔట్‌లెట్‌ మేనేజర్‌ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కుటుంబమంతటికీ ఉచితంగా పిజ్జాలను ఇస్తామంటూ మా సామాజిక, ఆర్థిక హోదాను కూడా కించపరిచారు అని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.