మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 మార్చి 2021 (13:45 IST)

నా ప్రియుడిని దొంగతనంగా కలిసేదాన్ని: కాజల్ అగర్వాల్

తన ప్రేమ, పెళ్లి గురించి నటి కాజల్ అగర్వాల్ వెల్లడించింది. తను పెళ్లాడిన గౌతమ్‌ను గత పదేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రేమించుకునే రోజుల్లో అతడిని దొంగతనంగా కలిసేదాన్ననని చెప్పుకొచ్చింది.
 
కాజల్ ప్రేమ గురించి ఆమె మాటల్లోనే... ''నా క్లాస్‌మేట్ గౌత‌మ్‌నే నేను పెళ్ళిచేసుకున్నాను. ప‌ది సంవ‌త్స‌రాల క్రిత‌మే నాకు త‌ను బాగా తెలుసు. సినిమా షూటింగ్ బిజీలో వున్నా ప్రేమ‌కు స‌రైన స‌మ‌యం కేటాయించ‌లేక‌పోయాను. ఇన్నాళ్లు మా ప్రేమ‌ను ర‌హ‌స్యంగా దాచ‌డానికి కార‌ణం గౌత‌మ్ తీసుకున్న నిర్ణ‌య‌మే.
 
మేమిద్ద‌రం ఇంటి స‌మీపంలో వున్న సూపర్ మార్కెట్‌లో క‌లిసివేవాళ్ళం. మాస్క్‌ వేసుకుని గౌత‌మ్ వ‌చ్చేవాడు. నేను కూడా అలా వ‌చ్చేదాన్ని. ముక్త‌స‌రిగా మాట్లాడుకునేవాళ్ళం. ఎన్నాళ్ళు ఇలా దొంగతనంగా కలుసుకోవడం అంటూ త్వ‌ర‌గా ఒక‌ట‌వుదామ‌ని అనుకున్నాం. ఈలోగా క‌రోనా వ‌చ్చింది.
 
ఆ స‌మ‌యంలోనే మా ఇంటిలో పెండ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. నేను మా నాన్న‌గారికి, అమ్మ‌గారికి తెలియ‌జేశాను. అయితే వారికి ముందుగానే చూచాయ‌గా తెలిసినా పైకి ఏమి అడిగేవారుకాదు. ఆఖ‌రికి ఇరువురు కుటుంబాల స‌మ‌క్షంలో పెండ్లి చేసుకున్నాం.
 
వివాహం త‌ర్వాత కూడా సినిమాలు చేయాల‌నే గౌత‌మ్ అన్నాడు. అలాంటి భ‌ర్త దొర‌క‌డం అదృష్టంగా భావిస్తున్నాను." అని చెప్పింది.