ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 మార్చి 2021 (16:09 IST)

23 ఏళ్ల ప్రియుడి కోసం 41 ఏళ్ల వివాహిత తన భర్తను హత్య చేయమంది...

ఢిల్లీలో ఇటీవల బైకుపై వచ్చిన ఓ వ్యక్తి కారులో వున్న మరో వ్యక్తిపై తుపాకీతో కాల్పుల జరిగిన ఘటన తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కారణం... ఆ యువకుడు వాడిన బైక్ నెంబర్ వేరేది కావడంతో కాస్త సమయం పట్టింది. ఐతే పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో నిందితుడిని పట్టుకోగలిగారు.
 
వివరాల్లోకి వెళితే.. అతడి పేరు రోహన్. వయసు 23 ఏళ్లు. అతడికి 41 ఏళ్ల వయసున్న భాటియా పరిచయమైంది. ఇద్దరి మాటలు కలిశాయి. అంతే... ఆ మహిళ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరచూ అతడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయం కాస్తా భాటీయా భర్త భీమ్ రాజ్‌కి తెలిసిపోయింది.
 
భార్యను గట్టిగా మందలించాడు. ఆమె ఎదురు తిరిగి సమాధానం చెప్పడంతో చేయి చేసుకున్నాడు. దీనితో భాటియా కుతకుతలాడిపోయింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని రోహన్‌ను రంగంలోకి దింపింది. తన భర్తను అంతం చేసేయమని చెప్పేసింది. దాంతో అతడు పక్కా ప్లాన్ ప్రకారం బైకు తీసుకుని భీమ్ రాజ్ కారు వెంటపడ్డాడు. కొంతదూరం వెళ్లాక అతడి కారుకి అడ్డంగా వెళ్లి ఎదురుగా నిలబడి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
 
తీవ్ర గాయాలపాలైన భీమ్ రాజ్ ను ఆసుపత్రికి తరలించారు. ఐతే నిందితుడు ఎవరన్నది కనుగొనేందుకు కాస్త ఆలస్యమైన పట్టుకున్నాడు. తొలుత రోహన్ ఓ కట్టుకథ చెప్పాడు. భీమ్ తో తనకున్న ఓ చిన్న తగాదా కారణంగా కాల్పులు జరిపినట్లు చెప్పాడు. ఐతే అతడి కాల్ డేటాను ఎదురుగా పెట్టేసరికి అసలు విషయం అంగీకరించాడు. భీమ్ భార్యతో తనకున్న వివాహేతర సంబంధం వల్లనే అతడిని హత్య చేయాలని కాల్పులు జరిపినట్లు తెలిపాడు.