శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:02 IST)

నేను ఆరోగ్యంగా ఉన్నాను, నెలరోజులు అంతే: రోజా

ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోని ఐసియు నుంచి తన నివాసానికి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమే స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ఒక వీడియోను తీసి ఆమే అభిమానులకు పంపారు.
 
నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఆందోళనకు గురికావద్దు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే వైసిపికి ఓట్లెయ్యాలని ప్రజలకు చెబుతూ ప్రచారం చేయడం.. ఎవరు భయపడకండి అంటూ రోజా ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. అంతే కాకుండా విజయదరహాసం చూపిస్తూ ఫోటోలను కూడా షేర్ చేశారు. 
 
ఇప్పటి వరకు రోజా ఆరోగ్యంపై వదంతులు రావడంతో పాటు ఆమె భర్త సెల్వమణి మాత్రమే అభిమానులతో మాట్లాడుతున్నారు. దీంతో అభిమానుల్లో మరింత ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో రోజానే స్వయంగా అభిమానులకు వీడియో పంపడంతో వారిలో ఆందోళన తగ్గింది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న నేతలే ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని నిర్వహించేస్తున్నారు.