సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (10:30 IST)

బెంగళూరులో 500 మంది చిన్నారులకు కరోనా.. పాఠశాలలు తెరిచి వుంటే పర్లేదు..

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంబిస్తుంది. బెంగళూరులో నెల రోజుల్లో 500 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. ఒక్క మార్చి నెలలోనే పదేళ్ల లోపు ఉన్న 50 మంది చిన్నారులకు ఈ వైరస్ వ్యాపించింది. మొత్తంగా 500 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 32 వేల మంది స్కూల్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా, అందులో 121 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
 
దీనిపై సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ.. కేసుల సంఖ్య పెరుగుతున్నా.. పాఠశాలలు తెరిచి ఉంటాయని చెప్పారు. 
పిల్లలు పాఠశాలకు వస్తే వారు క్రమశిక్షణతో ఒకే చోట ఉంటారు. వారు ఇంట్లో ఉంటే వారు అందరితో కలిసిపోతారు. పాఠశాలలు నియంత్రణ కోణం దిశగా కొనసాగడం మంచిది.
 
పరీక్షలు 15 రోజుల్లో జరుగుతాయని చెప్పారు. అందుచేత ప్రస్తుతానికి పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి అవసరం లేదన్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాలలు తెరిచి వుంచడాన్ని అంగీకరించట్లేదు. పాఠశాలలను మూసివేయడం మంచిదంటున్నారు.