శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (18:54 IST)

26మంది క్రీడాకారులకు కరోనా పాజిటివ్..

Athletes
కోవిడ్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలట్లేదు. కరోనా మహమ్మారి క్రీడాకారులను వదలట్లేదు. ఇప్పటికే చాలామందికి సోకింది. తాజాగా 26మంది అథ్లెట్లకుకు సోకింది. పటియాలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పటియాలలో ప్రాక్టీస్ చేసే 380 మందికి టెస్టు చేయగా అందులో 26మందికి పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది.
 
కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పుకుంది. వైరస్ ఉధృతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారత్‌లో గడిచిన 24గంటల్లో 53,480 పాజిటివ్ కేసులు నమోదవగా, 354 మంది వైరస్ బారినపడి చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ఈ సంవత్సరంలో సంభవించిన కరోనా మరణాల్లో ఈ సంఖ్య అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1,21,49,335కేసులు నమోదవగా 1,62,468మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా దేశంలో 5,52,566 యాక్టివ్ కేసులున్నాయి.