బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: బుధవారం, 31 మార్చి 2021 (23:14 IST)

01-04-2021 నుంచి 30-04-2021 వరకూ మీ మాస ఫలితాలు

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ప్రధమార్థం నిరాశాజనకం. రుణ ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. కొన్ని తప్పిదాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. అయినవరితో విభేదిస్తారు. వాగ్వివాదాలకు దిగవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఆధ్యాత్మికతపై దృష్టి పెడతారు. వ్యాపారాలు సామాన్యంగా వుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థాన చలనం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. జూదాలు, పందాల జోలికి వెళ్లవద్దు.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయానికి మించిన ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడతారు. అవసరాలు, చెల్లింపులు వాయిదా పడతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ప్రియతములను కలుసకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గృహంలో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరావు. ప్రయాణంలో అవస్తలెదుర్కొంటారు.
 
మిధున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో అభివృద్ధి సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరణకు మార్గం సుగమమవుతుంది. బాధ్యతగా వ్యవహరించాలి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా వుంటుంది. దుబారా ఖర్చులు విపరీతం. పొదుపు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహన చోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆప్తుల రాకపోకలు అధికమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంప్రదింపులకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ప్రముఖుల పరిచయాలు బలపడతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
సింహ రాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం వున్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలను దక్కించుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ నిందించవద్దు. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాసాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. మనోనిబ్బరంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. చేతిలో ధనం నిలవదు. సన్నిహితులు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతుల మధ్య సఖ్యతలోపం. సామరస్యంగా మెలగండి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. ఆత్మీయుల సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పిల్లల పైచదువులు వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి కలిసివచ్చే కాలం. పరిస్థితులు మెరుగుపడతాయి. సమర్థతను చాటుకుంటారు. పదవులు వరిస్తాయి. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. పరిచయాలు బలపడతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం సందడిగా వుంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. అధికారులకు స్వాగతం పలుకుతారు. వాహన చోదకులకు దూకుడు తగదు.
 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. పట్టుదలతో శ్రమిస్తే విజయం మీదే. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పెట్టుబడులకు తరుణం కాదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. న్యాయ, సేవా వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు.
 
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత వుంది. స్థిరాస్తి విక్రయంలో అడ్డంకులు తొలగుతాయి. రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. వాయిదా పడుతున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. పిల్లల దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ధనలాభం వుంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. గృహమార్పు కలిసివస్తుంది. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగలకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధుత్వాలు బలపడతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
 
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వివాహయత్నం ఫలిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవరాలతో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకంరా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త, విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.