గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: ఆదివారం, 21 మార్చి 2021 (15:28 IST)

21-03-2021 నుంచి 27-03-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఇష్టంతో కష్టపడితే మీదే విజయం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. కొన్ని విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు పునరావృతమవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు అలక్ష్యం తగదు. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2 పాదాలు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం వుంది. అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. గృహం సందడిగా వుంటుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధ వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ నిందించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. స్త్రీలకు పనివారల వైఖరి అసహనం కలిగిస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వైద్య, న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దస్త్రం వేడుకకు సన్నాహాలు చేస్తారు. పండ్ల, పూల వ్యాపారులకు ఆశాజనకం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే వుంటాయి. వివాహయత్నం ఫలిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఇచ్చిపుచ్చుకునే విషయంలో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గురువారం నాడు పనులతో సతమతమవుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆప్తులకు సహాయం అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వాహనచోదకులు అప్రమత్తంగా వుండాలి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. ఆటంకాలెదురైనా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. అభియోగాలు, విమర్శలు బాధిస్తాయి. శుక్ర, శని వారాల్లో పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకకు ముహూర్తం నిశ్చయమవుతుంది. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. నిరుత్సాహం వీడి ముందుకు సాగండి. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బుధ, గురు వారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఖర్చులు అధికం. అవసరాలకు డబ్బు సర్దుబాటవుతుంది. కీలక పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్ లు టార్గెట్లను అధిగమిస్తారు. పుణ్యక్షే్త్రాలను సందర్శిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థిక లావాదేవీలు పురోగతిని సాగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్తకొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆది, శుక్ర వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆప్తుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల కర్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. శనివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. సాయం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. అవసరాలు వాయిదా పడతాయి, మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. గృహమార్పు కలిసివస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగ సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయినవారి ప్రోత్సాహం ఉంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆరోగ్య విషయాలపై ఆసక్తి కలుగుతుంది. దైవ కార్యంలో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఖర్చులు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది వుండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మంగళ, బుధ వారాల్లో ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకకు హాజరవుతారు. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఇంటి విషయాలు పట్టించుకోండి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. గురువారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. పనుల్లో ఆటంకాలెదురవుతాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధాన. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవహారానుకూలత వుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో వుండవు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. గృహమార్పు కలిసి వస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తంలో సరుకు నిల్వ తగదు. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ వారం అనుకూలతలున్నాయి. మాట నిలబెట్టుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అదిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఒక వ్యవహారం మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమవుతుంది. నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం కదలికలపైన దృష్టి సారించండి. ఉద్యోగస్తులకు యూనియన్లో గర్తింపు లభిస్తుంది. వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయ.