గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 13 మార్చి 2021 (23:41 IST)

14-03-2021 నుంచి 20-03-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. సోమ, మంగళ వారాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఇతరుల విషయాలకు దూరంగా వుండాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలలో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగులకు ధనప్రలోభం తగదు. అధికారులకు కొత్త బాధ్యతలు. బెట్టింగులకు పాల్పడవద్దు. ప్రయాణాలు వాయిదా పడతాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. అయినవారికి సాయం అందిస్తారు. నిజాయతీకి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. బుధవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. గృహమార్పు కలిసివస్తుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి పురోభివృద్ధి.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆర్థికంగా కొంత పురోగమిస్తారు. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. సంప్రదింపులకు అనుకూలం. ఆది, గురు వారాల్లో అప్రియమైన వార్తలు వింటారు. ప్రముఖల సందర్శన వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సన్నిహితుల సలహా పాటిస్తారు. సంతానం విషయంలో శుభపలితాలున్నాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంస్థల స్థాపనలకు సమయం కాదు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆలయాల సందర్శన ఉల్లాసం కలిగిస్తుంది.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. రుణ ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రియతముల రాక ఉపశమనం కలిగిస్తుంది. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. శుక్ర, శని వారాలలో ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. స్వల్ప అశ్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వేడుకల్లో అతిగా వ్యవహరించవద్దు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. పొదుపు చేసే అవకాశం తక్కువ. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శన వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపధా పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ప్రైవేట్ సంస్థలలో వారికి నిరాశాజనకం. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. దాంపత్య సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. మంగళ, బుధ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. సంస్థల స్థాపనకు అనుకూలం. వేడుకకు హాజరవుతారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దస్త్రం వేడుకకు ముహూర్తం నిశ్చయమవుతుంది. చిరు వ్యాపారాలకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
తుల: చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక సమస్యలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ప్రియతములతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. ఆది, గురు వారాల్లో పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. పంతాలకు పోవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. పిల్లల చదువులపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. విద్యార్థులకు ఏకాగ్రతలోపం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆకస్మిక స్థానంచలనం. వేడుకల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. ఒప్పందాలు చేసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శని వారాల్లో ఫోన్ సందేసాల పట్ల అప్రమత్తంగా వుండాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ సిఫార్సుతో ఒకరి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వేడుకల్లో అత్యుత్సాహ తగదు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం అనుకూలదాయకమే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. హామీలు నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వాగ్వాదాలకు దివద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్లుగా వుండాలి. ఆదాయ వ్యయాలకు పొంత వుండదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దస్త్రం వేడుకకు ముహూర్తం నిశ్చయమవుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రైవేట్ సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. అకౌంట్స్, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ఆదోళన తగ్గి కుదుటపడతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకకు సన్నాహాలు చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్ సేల్ వ్యాపరాలకు పురోభివృద్ది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్న చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాధ్ర 1, 2, 3, 4 పాదాలు
సంప్రదింపులతో తీరిక వుండదు. ఎంత శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. పట్టుదలతో ముందుకు సాగండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ మాటలు అపార్థాలకు దారితీసే ఆస్కారం వుంది. మితంగా సంభాషించండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గురు, శుక్ర వారాల్లో చెల్లింపులు, నగదు శ్రీకరణలో జాగ్రత్త. ఆప్తుల కలియక ఉత్సాహాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంతోషకరమైన వార్తలు వింటారు. మీ శ్రమ వృధా కాదు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో వుండవు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పట్టుబడులకు అనుకూలం. వ్యవహార ఒప్పందాల్లో ఖచ్చితంగా వుండాలి. ఒత్తిళ్లు, మోహమాటాలకు పోవద్దు. పెద్దల సలహా పాటించండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.