సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-02-2021 - ఆదివారం మీ రాశి ఫలితాలు- శ్రీమన్నారాయణుడిని..?

శ్రీమన్నారాయణ స్వామిని తులసీదళాలతో ఆరాధించినట్లైతే శుభం కలుగుతుంది. 
 
మేషం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. కళ, క్రీడా, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. 
 
వృషభం: రాజకీయ నాయకుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతనవుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపార రంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి 
రాగలవు.
 
మిథునం: బంధువుల రాకపోకలు అధికంగా వుంటాయి. దూర ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కర్కాటకం: స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం మంచిది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి వుండాల్సి వస్తుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
సింహం: మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకును కలిగిస్తుంది. ఖర్చులు మీ స్థోమతకు తగినట్లే ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు అవమానాలను ఎదుర్కొంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ లక్ష్యసాధనకు మరింతగా శ్రమించాల్సి వుంటుంది. 
 
కన్య: ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా వుంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
తుల: వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. స్త్రీలు కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. చేతి వృత్తుల వారికి కలిసివస్తుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎదుటివారిని అథిగా విశ్వసించడం అంత మంచిది కాదని గమనించండి.
 
వృశ్చికం: మీ శ్రీమతి వైఖరిలో మార్పు మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో అనుభవజ్ఞులతో సంప్రదించండి. 
 
ధనస్సు: ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆందోళనలను ఎదుర్కొంటారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
మకరం : కాంట్రాక్టర్లకు కావలసిన ధనం కొంత ముందు వెనుకాలైనా అందుతుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు శుభదాయకం. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.
 
కుంభం: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. పాత మొండి బాకీలు వసూలు కాగలవు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. యాదృచ్ఛికంగా పుణ్యక్షేత్రాలలో ప్రముఖులను కలుసుకుంటారు. మీ చిన్నారులకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
మీనం: ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వర్ణకార వృత్తుల వారు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.