మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-02-2021 మంగళవారం రాశిఫలాలు - విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే..

మేషం : ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో పనివారితో లౌక్యం అవసరం. మనుష్యుల మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి గురవుతారు. 
 
వృషభం : మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. 
 
మిథునం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
సింహం : కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. స్త్రీలకు గృహాలంకరణ, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
కన్య : స్త్రీలకు కళ్లు, తల, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యక్రలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. 
 
తుల : విదేశీయానాలకై చేయు యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. చిన్నతరహా, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి.
 
వృశ్చిక : ఆడిట్, అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. సాహసించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. 
 
ధనస్సు : కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకున్నా నలుగురితో పాటు మాటపడాల్సివస్తుంది. బంధువుల నుంచి అవమానాలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. ప్రముఖుల సిఫార్సులతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
మకరం : బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. బంధు మిత్రులతో పరస్పర కానుకలిచ్చిపుచ్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. నిర్మాణ పనుల్లో బిల్డర్లు, కాంట్రాక్టర్లకు స్వీయ పర్యవేక్షణ చాలా ముఖ్యం. మీపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. 
 
కుంభం : ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదాపడుతుంది. స్త్రీలకు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు, ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. వాహన యోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఖర్చుల అధికమైనా మీ అవసరాలకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. 
 
మీనం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడుతారు. ఆధ్యాత్మిక, యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు.