ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-02-2021 శనివారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని పూజించినా...

మేషం : వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటుతగదు. మీ రాక బంధువులకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
వృషభం : వృత్తుల, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. సన్నిహితుల ఆలోచనలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
మిథునం :  మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచివుండాల్సి వస్తుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
కర్కాటకం : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టవలసి వస్తుంది. ధన విషయంలో ఎదుటివారిని అతిగా విశ్వసించడం మంచిదికాదు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
సింహం : విదేశీయానం, రుణ యత్నాలు వాయిదాపడాయి. విద్యార్థులు మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. పెద్దల విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. చేతి వృత్తుల వారికి సదాకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. భాగస్వామిక చర్చలు, సంప్రదింపులు ఫలిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కన్య : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. కావలసిన పత్రాలు వస్తువులు, సమయానికి కనిపించకపోయే అస్కారం ఉంది. 
 
తుల : పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. దైవ కార్యాలకు సహాయ సహకారాలందిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
వృశ్చికం : స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్త అవసరం. విద్యార్థులకు వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ఎల్.ఐ.సి, పోస్టల్, ఏజెంట్ల శ్రమ, త్రిప్పట తప్పవు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం. 
 
ధనస్సు : ఉద్యోగస్తులు కార్యాలయ కార్యార్థం ప్రయాణం చేయవలసి వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు ఇది అనుకూలం. దంపతుల మధ్య అవగాహనా లోపం, చిన్న చిన్న కలహాలు తలెత్తుతాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. బంధువుల ఆకస్మిక రాక వల్ల ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. 
 
మకరం : మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించేవారుండరు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార రంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు. విద్యార్థుల వల్ల ఉపాధ్యాయులు నిరుత్సాహం, ఆందోళన వంటివి ఎదుర్కొంటారు. 
 
కుంభం : స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. మీ అలవాట్లు, మాటతీరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. 
 
మీనం : మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీ ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ప్రతికూలతలెదరువుతాయి. వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. స్త్రీల చేతిలో ధనం నిలవడం కష్టం.