గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-02-2021 సోమవారం దినఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం...

మేషం : ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. స్త్రీలకు నూతన పరిచయాలు, చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. వస్త్రం, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
వృషభం : మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
మిథునం : కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. పాత మిత్రుల కలయికతో మీలో ఆలోచనలు చోటు చేసుకుంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
కర్కాటకం : వృత్తుల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా సాగుతాయి. అవివాహితల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతాయి. స్త్రీలు షాపింగులో మెళకువ అవసరం. 
 
సింహం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో స్వల్ప ఆటంకాలు లెదురవుతాయి. శత్రువులు, మిత్రులుగా మారతాయి. సోదరి, సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు. 
 
కన్య : ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ఆడిటర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. అనుకోకుండా ప్రయాణం చేయవలసివస్తుంది. బ్యాంకు రుణాలు తీర్చుతారు. మీ విలువైన వస్తువులు, పత్రాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
తుల : దైవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహిరిస్తారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
వృశ్చికం : స్వతంత్ర నిర్ణయాలు చేసుకొనుట వల్ల శుభం చేకూరగలదు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి, వాహనం యోగం వంటి శుభ సూచనలున్నాయి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. 
 
ధనస్సు : పాత్ర మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి శ్రమాధిక్యత విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
మకరం : ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఒంటెత్తు పోకడ మంచిదికాదని గమనించండి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
కుంభం : స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలలో మెళకువ వహించండి. మీ సంతానం కోసం ధనం వ్యయం చేస్తారు. స్త్రీలు దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఉన్నతస్థాయి అధికారులకు, క్రిందిస్థాయి సిబ్బందితో ఇబ్బందులెదురవుతాయి. 
 
మీనం : వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించడం మంచిది. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన దిశగా ఆలోచన చేస్తారు.