శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-02-2021 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్య హృదయం చదివినా..?

ఆదిత్య హృదయం చదివినా లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: కుటుంబీకులతో ఏకీభవించలేకపోచారు. సృజనాత్మకంగా వ్యవహరించినప్పుడు మాత్రమే లక్ష్య సాధన వీలవుతుందని గ్రహించండి. పెద్ద హోదాలో వున్నవారికి అధికారిక పర్యటనలు, ఖర్చులు అధికమవుతాయి. మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
వృషభం: కిరాణా, ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాలు వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు, క్రీడలు, వేడుకల్లో బాగా రాణిస్తారు. పెద్దల ఆరోగ్యంలో కుదుటపడుతుంది. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.   
 
మిథునం: ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా వెలితిగా వుంటుంది. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా వుండటం శ్రేయస్కరం. ప్రియతముల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికం. అనారోగ్యం మిమ్మల్ని బాధించవచ్చు. 
 
కర్కాటకం: శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కుటుంబంలోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తోంది. ధన వ్యయం విపరీతంగా వున్నా సార్థకత వుంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. ప్రతి విషయంలోను ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. 
 
సింహం: రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. విదేశీ యత్నాలు వాయిదా పడతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం అధికమవుతుంది. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖుల కోసం షాపింగ్‌లు చేస్తారు. 
 
కన్య: మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో అనవసర వాదనలకు దిగకండి. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. రాజకీయ నాయకులు సమావేశాల్లో మెళకువగా వ్యవహరించండి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. 
 
తుల: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రముఖులతో పరిచయాలు, తరచూ విందులు వంటి శుభ సంకేతాలున్నాయి. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారులకు శుభదాయకం. విద్యార్థినులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. ప్రత్యర్థులను ఓ కంట కనిపెట్టండి. 
 
వృశ్చికం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం మంచిది. బంధుమిత్రుల కలయితో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. మీ కష్టం, సమర్థతలను ఇతరులు తమ స్వార్థానికి వాడుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
ధనస్సు: లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. ప్రతి క్షణం కుటుంబీకుల క్షేమం గురించి ఆలోచిస్తారు. వ్యాపారాల్లో మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు. జాగ్రత్త వహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
మకరం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన తప్పదు. అయిన వారి విషయంలో మీ అపోహలు, సందేహాలు నిజం కాదని గ్రహించండి. దంపతుల మధ్య పట్టింపులు, అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. 
 
కుంభం: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మత్స్య, రొయ్యల వ్యాపారస్తులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
మీనం: ప్రతి అవకాశం చివరి వరకు వచ్చి చేజారిపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి వుండాల్సి వస్తుంది. కుటుంబ సౌఖ్యం, తరచు విందు భోజనాలు వంటి శుభ సంకేతాలున్నాయి. ఖర్చులు అధికమవుతాయి.