మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-02-2021 శనివారం రాశిఫలాలు - వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా...

మేషం : అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు బదిలీ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితుల ద్వారా అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. 
 
వృషభం : స్త్రీలకు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కలప, ఇటుక, ఇసుక రంగ వ్యాపారస్తులకు లాభదాయకం. ఆదాయ, వ్యయాల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థులు ఉన్నత చదువుల విషయంపై ఒక నిర్ణయానికి వస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో మెళకువ అవసరం. 
 
మిథునం : బ్యాంకు పనులలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినా పరిష్కారమవుతాయి. ప్రేమికుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురించగలవు. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాగ్రత వహించలేకపోతారు. 
 
కర్కాటకం : ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ, రాత పరీక్షలలో మెళకువ ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి క్రయ లేదా విక్రయ దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : దంపతుల మధ్య కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులుపూర్తికాగలవు. నూతన వ్యాపారాలు, సంస్థల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
కన్య : ఉద్యోగస్తులకు ఏమంత ప్రోత్సాహకరంగా ఉండదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం. స్త్రీలు విలాస వస్తువుల సమకూర్చుకుంటారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని  సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
తుల : విద్యార్థులకు భయాందోళనలు అధికమవుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం కానవస్తుంది. ఎల్ఐసి పోస్టల్ ఏజెంట్లకు శ్రమ అధికమవుతుంది. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు, నర్సులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. 
 
వృశ్చికం : కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. విదేశీయానం, రుణ యత్నాల్లో కొంత పోరుగతి కనిపిస్తుంది. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు, పనులు వాయిదాపడతాయి. 
 
ధనస్సు : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. స్త్రీలకు పనిభారం అధికం. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
మకరం : ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అరియర్స్, ఇతర బెనిఫిట్స్ మంజూరవుతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. ఏవిషయానికీ కలిసిరాని సోదరీ సోదరుల ధోరణి అసహనం కలిగిస్తుంది. వస్త్ర, బంగారు వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. 
 
కుంభం : ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి మెలగవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. కార్యసాధనలో జయం పొందుతారు. రావలసిన ఆదాయంలో కొంత మొత్తమైనా చేతికందుతుంది. 
 
మీనం : లీజు, ఏజెన్సీలు, టెండర్ల వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. బంధు మిత్రులు మొహమ్మాటాలు ఒత్తిడికి గురిచేస్తారు. ధన విషయంలో ఎదుటివారిని అతిగా విశ్వసించడం మంచిదికాదు. ఆశ్చర్యకరమైన వార్తలు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు జరుగుతాయి.