శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (09:14 IST)

09-02-2021 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడుని పూజించినా...

మేషం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అనుకూలమైన కాలం. క్లిష్టమైన సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. బ్యాంకు పనుల్లో మెళకువ వహించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. దంపతుల మధ్య పట్టింపులు, చికాకులు అధికమవుతాయి. దూరపు బంధువుల నుంచి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
వృషభం : అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణంలో మార్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆటంకాలు తప్పవు. 
 
మిథునం : ప్రతి వ్యవహారంలో మీరే చూసుకోవడం మంచిది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత పరిస్థితులేర్పడతాయి. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తిచేస్తారు. 
 
కర్కాటకం : ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేస్తారు. వైద్య రంగాల వారికి మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. స్త్రీలకు బంధు వర్గాలతో సఖ్యత నెలకొంటుంది. ఖర్చులు పెరగడంతో పొదుపు చేయాలన్న ధ్యేయం నెరవేరదు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
సింహం : విద్యార్థులకు ఒత్తిడి, మానసికాందోళన అధికమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆత్మీయులు, పెద్దలతో కీలకమైన విషయాలు చర్చిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. ఖర్చులు, చెల్లింపుల విషయంలో ఏకాగ్రత వహించండి. కొంతకాలంగా వాయిదాపడిన పనులు పూర్తి చేస్తారు. 
 
కన్య : ఆదాయానికి మంచి ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండగలదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
తుల : బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించండి. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల అవగాహన, ధ్యేయం పట్ల ఏకాగ్రత ఏర్పడతాయి. రాజీధోరణితో వ్యవహరించడం వల్ల ఒక సమస్య పరిష్కారమవుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం.
 
వృశ్చికం : విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. రుణాల కోసం అన్వేషిస్తారు. పోస్టల్, ఎల్ఐసి, ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. కీలకమైన విషయాలు మీ జీవితభాగస్వమికి తెలియచేయడం మంచిది.
 
ధనస్సు : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. రావలసిన ధనం సకాలంో అందుట వల్ల పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు అధికమవుతున్నారని గమనించండి. 
 
మకరం : ఆర్థిక విషయాలలో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ముఖ్యుల మధ్య మనస్పర్థలు తలెత్తినా సమసిపోగలవు. నూతన పరిచయాలేర్పడాతాయి. రవాణా రంగాలలోని వారికి పనిభారం అధికమవుతుంది. వాహనం కొనుగోలుకే చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. స్త్రీల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
కుంభం : దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు తల, కళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. మిత్రులను కలుసుకుంటారు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. 
 
మీనం : మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిదికాదు. ఉద్యోగస్తులు అందరితో సఖ్యతగా మెలుగుతూ తమ పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. రుణ విముక్తులు కావడంతో మనస్సు తేలికపడుతుంది. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారదిశగా సాగుతాయి.