శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

07-02-2021- ఆదివారం మీ రాశి ఫలితాలు-సూర్య నారాయణ పారాయణ చేసినట్లైతే

సూర్య నారాయణ పారాయణ చేసినట్లైతే అన్నివిధాలా కలిసివస్తుంది. 
 
మేషం: ఆస్తి పంపకాల విషయంలో సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది కాదు. రుణాలు తీరుస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. 
 
మిథునం: మీ శ్రమకు తగిన ప్రోత్సాహం, ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. మీ శ్రీమతితో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడుతాయి. ఆదాయానికి మించి ఖర్చులున్నా వెసులుబాటు వుంటుంది. 
 
కర్కాటకం: స్వయంకృషితో రాణిస్తారనే విషయం గ్రహించండి. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు వాహన యోగం, వస్త్రప్రాప్తి, వస్తులాభం వంటి శుభ ఫలితాలున్నాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సాయం అందిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. దూర ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
సింహం: ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. స్త్రీలకు షాపింగ్ విషయాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. 
 
కన్య: వ్యాపారాల్లో నష్టాలను అధికమించడానికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. మనసులో భయాందోళనలూ అనుమానాలు వున్నా, డాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ విషయాల్లో ప్రముఖులను సంప్రదిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
తుల: దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎప్పటి నుంచో మీరు కంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గరపడనుంది. ఆలయాలను సందర్శిస్తారు. సన్నిహితుల సహకారంతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. పొదుపు పథకాల్లో ఆశించిన ప్రతిఫలం అందడం కష్టం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
వృశ్చికం: స్త్రీలకు అసహనం, నిరుత్సాహం, ఏ విషయం పట్ల ఆసక్తి వుండకపోవడం వంటి చికాకులు ఎదురవుతాయి. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం మంచిది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. సమావేశాలు, వేడుకల్లో చిన్నారులు కీలక పాత్ర పోషిస్తారు. ప్రయాణాల్లో మెళకువ అవసరం. 
 
ధనస్సు: సన్నిహితుల ప్రోత్సాహంతో నిరుద్యోగులు ఉపాధి పథకాలు చేపడతారు. అనుకోని ఖర్చులు ఎదురైనా ధనానికి ఇబ్బందులుండవు. స్త్రీలకు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పిల్లల కోసం ప్రియతముల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. 
 
మకరం: హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. రుణాలు తీరుస్తారు. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయం ఎంతో సంతృప్తినిస్తుంది. విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఫ్యాన్సీ, కిరణా, మందుల వ్యాపారస్తులకు లాభదాయకం.
 
కుంభం: ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. మీరు ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. సోదరీ, సోదరులతో అభిప్రాయబేధాలు ఏర్పడతాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
 
మీనం: చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా సాగుతాయి. పాత మిత్రుల కలయికతో గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీల అనాలోచిత నిర్ణయాలు, ఆగ్రహావేశాల వల్ల కుటుంబంలో చికాకులు, కలహాలు తలెత్తుతాయి.