మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-02-2021- బుధవారం మీ రాశి ఫలితాలు_గాయత్రి మాతను ఆరాధించినట్లైతే

గాయత్రి మాతను ఆరాధించినట్లైతే శుభం చేకూరుతుంది. 
 
మేషం: శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. రుణాలు తీరుస్తారు. కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏ పని మొదలెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తిచేయండి. ఉద్యోగస్తులు సమర్థతను అధికారులు గుర్తిస్తారు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
వృషభం: ఆదాయ వ్యయాల్లో ఆచితూచి వ్యవహరించండి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులు తప్పవు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా వుండటం శ్రేయస్కరం. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు.
 
మిథునం: చేతివృత్తుల వారికి సామాన్యం. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. ప్రయాణాలు, బ్యాంకింగ్ పనుల్లో అప్రమత్తంగా మెలగండి. కొబ్బరి, పండ్ల కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలు భేషజాలకు పోకుండ లౌక్యంగా వ్యవహరిస్తే మంచిది.
 
కర్కాటకం: వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థతకు గురవుతారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలో అందరినీ కలుసుకుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. 
 
సింహం: ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించినంత మార్పు లేకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురౌతారు. సంకల్పబలంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు.
 
కన్య: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల ఇక్కట్లు ఎదురవుతాయి. ముఖ్యమైన విషయాలపై చర్చ జరుపుతారు. విద్యార్థినులు భయాందోళనలు వీడి శ్రమించినట్లైతే సత్ఫలితాలు లభిస్తాయి. భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కొంటారు. 
 
తుల: మీ కుటుంబం కోసం అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. గృహోపకరణాలను అమర్చుకోవటంలో మునిగిపోతారు. హోటల్, కేటరింగ్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి.
 
వృశ్చికం: మీరు పని చేసిన చోట పెద్ద రహస్యం బయటపడుతుంది. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. అనుకోకుండా బాకీలు వసూలవుతాయి. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం.
 
ధనస్సు: ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు తీరుతాయి.
 
మకరం: పత్రికా సంస్థల్లోని వారికి ఎంత శ్రమించినా ఏమాత్రం గుర్తింపు ఉండదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ప్రయాసలు అధికం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ యత్నాలను నీరుగార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఆశాజనకంగా సాగుతాయి. 
 
కుంభం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చివరి క్షణంలో చేతిలో ధనం ఆడక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. మిమ్ములను పొగిడేవారిని ఓ కంట కనిపెట్టడం ఉత్తమం. స్త్రీలకు అయిన వారి నుంచి కావలసిన సమాచారం అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి.
 
మీనం: బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి వుంటుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వస్త్ర, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు అభివృద్ధి. ప్రముఖులను కలిసి ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు.