మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-02-2021 శుక్రవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరిని పూజించినా...

మేషం : సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవడం మంచిదికాదు. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇతర ఆలోచనలు విరమించుకుని ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టిసారించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. యత్నాలు ఫలించక, అవకాశాలు కలిసిరాక విరక్తి చెందుతారు. 
 
వృషభం : ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పువు. మీ కందిన చెక్కును చెల్లక ఇబ్బందు లెదుర్కొంటారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచవద్దు.
 
మిథునం : ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి తప్పదు. సోదరీ సోదరులతో విభేదాలు తెలెత్తుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల సమస్య తెలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. అయినవారితోనైనా వ్యవహారంలో ఖచ్చితంగా ఉండాలి. 
 
కర్కాటకం : ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. కానివేళలో ఇతరులకరాక ఇబ్బంది కలిగిస్తుంది. ఫ్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం.
 
సింహం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కన్య : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త పథకాలు మొదలవుతాయి. 
 
తుల : గృహ నిర్మాణాలు, మరమ్మతులలో వ్యయం మీ అంచనాలను దాటుతుంది. కుటుంబ విషయాల్లో పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. కొంతమంది మీ దృష్టి మళ్లించి మోసగించే ఆస్కారం ఉంది. కుటుంబ విషయాల్లో స్థిమితంగా ఉండకపోతే మానసిక అశాంతికి లోనవుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
వృశ్చికం : లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులేమాత్రం ఉండవు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తడి అధికం. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచే చేస్తుది. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
 
ధనస్సు : వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఒక్కసారి ప్రేమిస్తే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎంతైనా పోరాడుతారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ దృక్పథం బలపడుతుంది. ఆదర్శభావాలు గల వ్యక్తితో ఆత్మీయబంధం బలపడుతుంది. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. 
 
మకరం : ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించక పోవచ్చు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేక పోతారు. ఆశ్చర్యకరమైన వార్తలు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రతి అవకాశం చివరి వరకూ వచ్చి చేజారిపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
కుంభం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి పొందుతారు. బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు అంతగా ఉండవు. మనోధైర్యం, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. 
 
మీనం : ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఎంతో కొంత పొదువు చేయాలనే మీ సంకల్పం నెరవేరదు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి.