మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-02-2021 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించినా...

మేషం : విద్యుత్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. గృహ వాస్తు నివారణ వల్ల మంచి ఫలితాలుంటాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. 
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రావలసిన బాకీలు వసూలు కాకపోవడంతో ఆందోళన చెందుతారు. మీ లోటుపాట్లు, తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. 
 
మిథునం : అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల అపుడపుడు అస్వస్థతకు గురవుతారు. మీ మాట నెగ్గకపోయినా మీ గౌరవానికి భంగం కలగదు. విద్యార్థుల ప్రేమ వ్యవహారం పెద్దలకు సమస్యగా మారుతుంది. ఒక స్థిరాస్తి కొనుగోలుదిశగా మీ ఆలోచనలుంటాయి. దూర ప్రాంతాలలోని ఆలయాలను సందర్శిస్తారు. 
 
కర్కాటకం : వృత్తిపరంగా ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. ప్రింటింగ్ రంగాలవారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాలు తప్పవు. కోర్టులో దావా వేసే విషయంలో పునరాలోచన మంచిది. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయమవుతాయి. 
 
సింహం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి రూపొందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలమవుతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సౌదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి. 
 
కన్య : మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఏ వ్యక్తినీ తక్కువ అంచనా వేయడం మంచిదికాదు. కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. తప్పిదాలు అధికారులదే అయినా కింది స్థాయి ఉద్యోగులే బాధ్యులవుతారు. బంధు మిత్రుల నుంచి అవమానాలు ఎదుర్కొంటారు. 
 
తుల : స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దైవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ ఖర్చులు పెరిగినప్పటికీ, రాబడి కూడా పెరుగుతుంది. పోస్టల్, ఎల్.ఐ.సి, ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అనుకూలం. ట్రావెలింగ్, ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి అశాజనకం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. 
 
ధనస్సు : వస్త్ర వ్యాపారులు, పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. మీ మాటకు వ్యతిరేకత, అపఖ్యాతి వంటి చికాకులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలు వాయిదాపడతాయి. పెద్దలకు ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
మకరం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రేపటి గురించి ఆందోళన చెందుతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించకండి. 
 
కుంభం : నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఖర్చుల నిమిత్తం ఎక్కువ ధనం వెచ్చించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిమ్మలను చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
మీనం : హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల, వ్యాపారులకు లాభదాయకం. పెద్ద మొత్తం నగదుతో ప్రయాణాలు మంచిదికాదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రభుత్వ అధికారులతో పరిచయాలేర్పడతాయి.