మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-02-2021 శుక్రవారం రాశిఫలాలు - కుబేరుడిని ఆరాధించినా...

మేషం : వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారాలు మందకొడిగాసాగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల స్వల్ప చికాకులు వంటివి తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, స్థానచలనం, ఆందోళన కలిగిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. 
 
వృషభం : ఉపాధ్యాయులకు విద్యార్థులపై అధిక ఏకాగ్రత అవసరం. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నేరవేరుతుంది. ప్రేమికులకు ఎడబాటు, ఊహించని చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో ప్రముఖులను కలుసుకుంటారు.
 
మిథునం : ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసివస్తుంది. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
కర్కాటకం : బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్వవేక్షణ ముఖ్యం. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
సింహం : కుటుంబీకుల మధ్య సఖ్యత లోపిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు అనుకూలం. సొంత వ్యాపారాలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, స్థిరత్వం నెలకొంటాయి.
 
కన్య : ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాలవారికి ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. ఆహార, వ్యవహారాల్లో నిక్కచ్చిగా వ్యవహరించడం శ్రేయస్కరం. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు నుంచి నోటీసులు అందుతాయి. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. 
 
తుల : హామీలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో సమయస్ఫూర్తి అవసరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాలవారికి మిశ్రమ ఫలితం. విద్యార్థుల్లో భయాందోళనలు, సందేహాలు అధికమవుతాయి. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
వృశ్చికం : చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులకు అన్నివిధాలా కలిసిరాగలదు. కార్యసాధనలో ఆటంకాలు తొలగిపోగలవు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. స్త్రీలకు స్కీంలు, వస్తు నాణ్యతలో ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.
 
ధనస్సు : మీ సంతానం భవిష్యత్ కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వల్ల ప్రేమికులు ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు అధిక శ్రమ, ఒత్తిడి, ఆందోళనలు వంటివి తలెత్తుతాయి. ఆత్మీయులు, కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు.
 
మకరం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం మంచిది. ఆధ్యాత్మిక, సేవా సంస్థలతో ఇతోధికంగా సహకరిస్తారు. మీ ఔన్నత్యాన్ని అందరూ కొనియాడుతారు. ఉన్నతస్థాయి ఉద్యోగస్తులకు కిందిస్థాయిసిబ్బందితో సమస్యలు ఎదుర్కొంటారు. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. 
 
కుంభం : ఏ వ్యవహారాన్ని ఇతరులకు పూర్తిగా అప్పగించడం మంచిదికాదు. హామీలు, ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మీనం : కాంట్రాక్టర్లకు చేతిలో పని పూర్తికావడంతో ఒకింత కుదుటపడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, కోరుకున్న చోటుకి బదిలీ వంటి శుభసంకేతాలున్నాయి. స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు నిరుత్సాహం వంటివి తప్పవు. ఆపద సమయంలో మిత్రులు ఉండగా నిలుస్తారు.