సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

22-02-2021 సోమవారం రాశిఫలాలు - శంఖరుడిని పూజించినా మీ సంకల్పం...

మేషం : ఆర్థిక లావాదేవీల సమర్థంగా నిర్వహిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు తీరుస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. విద్యార్థినులతో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. 
 
వృషభం : ఆస్తి వ్యవహారాల్లో పెద్దల నిర్ణయం నిరుత్సాపరుస్తుంది. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మిథునం : గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారులకు లాభదాయకం. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలలో వారికి లాభదాయకం. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో కలిసి తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిదని గమనించండి. 
 
సింహం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉన్నా రాబడి విషయంలో పురోభివృద్ధి పొందుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు, విధి నిర్వహణలో సమర్థత కనబర్చి అధికారులు గుర్తింపు పొందుతారు. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహన చోదకులకు చికాకులు తప్పవు. 
 
కన్య : మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోడం శ్రేయస్కరం. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు ఏకాగ్రతా లోపం వల్ల చికాకులు తప్పవు. లీజు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో చర్చలు జరుపుతారు. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
తుల : వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. విదేశీయానం, రుణయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. పుణ్యకార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ఆడిటర్లకు నెమ్మదిగా మార్పు కానవస్తుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్త అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో మెళకువ అవసరం. 
 
ధనస్సు : కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీరెదురు చూస్తున్న రశీదులు, విలువైన పత్రాలు అందుకుంటారు. స్త్రీలకు సంఘంలో మాటకు గౌరవం, ఆమోదం లభిస్తాయి. రాబడికి మంచిన ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. 
 
మకరం : బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు త్వరలో ప్రమోషన్, కోరుకున్న చోటుకి బదిలీ కాగలవు. అనుకోకుండా ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. జాయింట్ వెంచర్లు, నూతన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
కుంభం : వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. విద్యార్థులు భయాందోళనలు వీడి మరింత కష్టపడాల్సి ఉండదు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. లిటిగేషన్ వ్యవహారాలు, మొండిబాకీలు వసూలవుతాయి. 
 
మీనం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా సాగుతాయి. ఆస్తి పంపకాలు, భూ క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.