గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-02-2021 ఆదివారం దినఫలాలు - ఆదిత్యుని ఎర్రని పూలతో పూజించినా...

మేషం : నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
వృషభం : స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు.
 
మిథునం : నిరుద్యోగులకు ఇంటర్వ్యూల పట్ల ఏకాగ్రత వహించవలసి ఉంటుంది. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
కర్కాటకం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వస్తారు. కుటుంబీకులతో కలిగి ఆలయాలను సందర్శిస్తారు. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పాత మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి పొందుతారు. 
 
సింహం : మీ లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధు మిత్రులతో కలిసి విందులు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
కన్య : ఉద్యోగస్తులకు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రాజకీయ నాయకులు తొందరపడి సంభాషించడంవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత ప్రయాసలు తప్పవు. 
 
తుల : చిత్తశుద్ధతితో మీరు చేసిన సహాయానికి, సేవలకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ప్రముఖుల ఇటంర్వ్యూ కోసం అధిక సమయం వేచివుండాల్సి వస్తుంది. మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచివుండాల్సి వస్తుంది. ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించడం వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. 
 
వృశ్చికం : స్త్రీలుకళ్ళు, తల, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. టీవీ రేడియో సాంకేతిక రంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది. మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. మత్స్యుకోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్య ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. 
 
ధనస్సు : రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. 
 
మకరం : వ్యాపారాల్లో ఒడిదుడుకులెదురైనా అధికమిస్తారు. స్త్రీలకు ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణదాతలతో కలహించక సర్దిచెప్పేందుకు యత్నించాలి. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. 
 
కుంభం : రవాణా రంగాలలోని వారికి ఇబ్బందులు తప్పవు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పాతమిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. వ్యాపారాభివృద్ధద్ధికి చేయు కృషిలో పోటీ వాతావరణం అధికం కావడంతో ఆందోళన చెందుతారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
మీనం : ప్రముఖులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ శ్రమకు తగిన ప్రోత్సాహం, ప్రతిఫలం పొందుతారు. స్త్రీలకు ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.