మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-02-2021 బుధవారం రాశిఫలాలు - సుందరకాండ పారాయణం చేస్తే..

మేషం : ప్రైవేటు సంస్థలలో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. వాహనం ఇతరులకు ఇవ్వడం మంచిదికాదు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఆటంకాలు సమసిపోగలవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
వృషభం : ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయుల నుంచి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఆత్మ విశ్వాసం రెట్టింపవుతుంది. 
 
మిథునం : మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉపాధ్యాయులు సహోద్యోగులతో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు జయం చేకూరుతుంది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులు పై అధికారుల మన్నలు పొందుతారు. 
 
సింహం : కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో అనవసరపు వాదనలకు దిగకండి. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు, అసహనం తప్పవు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం మంచిదని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. 
 
కన్య : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సదావకాశాలు లభిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారిక సదావకాశాలు లభిస్తాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. 
 
తుల : విద్యార్థినులలో మానసిక ధైర్యం, సంతృప్తి చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఒక అవకాశం కలిసివస్తుంది. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. స్త్రీలకు అకాల భోజనం, శ్రమాధిక్యతవల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృశ్చికం : ఫైనాన్స్, చిట్స్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. విందులలో పరిమితి అవసరం. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
ధనస్సు : బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కళ్యాణ మండపాల కోసం అన్వేషిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృథా ఖర్చుల వల్ల కుటుంబంలో మనస్పర్థలు తలెత్తుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
మకరం : మీ శ్రీమతి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఉపాధ్యాయులలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. 
 
కుంభం : వస్త్రం, ఫ్యాన్సీ, కిరాణా, బంగారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండగలదు. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. షామియాన, సప్లయ్ రంగాలలోవారికి గణనీయమైన పురోభివృద్ధి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. 
 
మీనం : కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు ఇతరుల కారణంగా స్థిరబుద్ధి కోల్పోతారు. స్త్రీలు మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఖర్చులు అధికం రుణాలు చేబదుళ్లు తప్పకపోవచ్చు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.