శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (19:52 IST)

ఓరి దరిద్రుడా.. ఆడ శునకాన్ని కూడా వదిలిపెట్టలేదు.. నెలల తరబడి..?

కామాంధుల దుశ్చర్యలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్న కామపిశాచులు.. ప్రస్తుతం మూగ జీవులపై కూడా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా శునకంపై 65 ఏళ్ల వృద్ధుడు నెలల తరబడి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లాలో వెలుగుచూసింది. 
 
మూగజీవిపై ఈ నీచ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి పుణేలోని మోడల్‌ కాలనీకి చెందిన ఓ రెసిడెన్షియల్‌ సొసైటీ పార్కింగ్‌ ఏరియాలో వృద్ధుడు కుక్కపై నీచానికి ఒడిగట్డాడు.
 
గత ఏడాది అక్టోబర్‌ నుంచి నిందితుడు ఆడ కుక్కపై దారుణానికి పాల్పడుతున్నాడు. నిందితుడి ఆగడంపై స్ధానిక వాలంటీర్ల ద్వారా పసిగట్టిన స్వచ్ఛంద సంస్థ రెస్క్యూ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిందితుడిని ఆధారాలతో సహా పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. 
 
కెమెరాలను ఏర్పాటు చేసిన మూడో రోజే కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతూ నిందితుడు పట్టుబడ్డాడని రెస్య్కూ ట్రస్ట్‌ ఫౌండర్‌ నెహ పంచమియా తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం బాధిత శునకం రెస్క్యూ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సంరక్షణలో ఉంది.