క్లాసిక్ లెజెండ్స్, ఇండోర్ లోని తన పీతమ్ పూర్ ప్లాంటు వద్ద అడ్వాన్స్‌డ్ నేషనల్ ట్రెయినింగ్ సెంటర్‌ను ప్రారంభించటం ద్వారా సాంకేతిక సామర్ధ్యాన్ని మరియు సేవా శ్రేష్ఠతను పటిష్టం చేసుకునే తన ప్రస్థానంలో మరొక ముఖ్యమైన మైలురాయిని చేర్చుకుంది. భవిష్యత్తు కోసం సంసిద్ధమైన టాలెంటును తయారు చేయటం పట్ల, ప్రపంచ-శ్రేణి శిక్షణా మౌలికసదుపాయాల్లో పెట్టుబడులు పెట్టటం పట్ల కంపెనీ నిబద్ధతను ఈ కొత్త కేంద్రం నొక్కి వక్కాణిస్తుంది.
అధునాతనమైన, స్వయంగా నేర్చుకునే అవకాశం కల్పించే, నైపుణ్యాల కోసం ఉద్దేశించిన సాంకేతిక శిక్షణను అందించేందుకు వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసిన జాతీయ శిక్షణా కేంద్రం (నేషనల్ ట్రెయినింగ్ సెంటర్), వాస్తవప్రపంచపు డయాగ్నోస్టిక్స్, ఖచ్ఛితమైన రిపెయిర్ పద్ధతులు మరియు స్థిరస్వరూపం కలిగిన నైపుణ్యాభివృద్ధి పై దృష్టి సారిస్తుంది. అన్ని రకాల డీలర్షిప్‌ల వ్యాప్తంగా, టెక్నీషియన్లు మరియు సర్వీస్ ప్రొఫెషనల్సుకు సహకారాన్ని అందించేందుకు దీనిని రూపొందించటం జరిగింది. సర్వీస్ నాణ్యతను ప్రమాణీకరించటంలోను, విక్రయానంతర శ్రేష్ఠతను పెంపొందించటంలోను కీలకమైన పాత్రను ఈ కేంద్రం పోషిస్తుంది.
అనుపమ్ తరేజా, సహ-సంస్థాపకులు, క్లాసిక్ లెజెండ్స్, ఇలా అన్నారు, మా బ్రాండ్లు అభివృద్ధి చెందుతూ ఉన్న నేపథ్యంలో, మా సర్వీస్ సామర్ధ్యపు ఈకోవ్యవస్థను పటిష్టపరుచుకోవలసిన అవసరం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అడ్వాన్స్‌డ్ నేషనల్ ట్రెయినింగ్ సెంటర్ అనేది, భవిష్యత్తు కోసం సంసిద్ధంగా ఉన్న టెక్నీషియన్లను తయారు చేయాలన్న, మా నెట్వర్క్ వ్యాప్తంగా సర్వీస్ శ్రేష్ఠతను ప్రమాణీకరీచాలన్న సంకల్పంతో, వ్యక్తులు, నైపుణ్యాలు, మౌలికసదుపాయాల మీద పెట్టే ఒక వ్యూహాత్మకమైన పెట్టుబడి. జావా, యెజ్‌డీ, BSAలను నడిపే ప్రతి రైడర్ ఒక స్థిరమైన, అత్యంత నాణ్యమైన ఓనర్‌షిప్ అనుభవాన్ని స్వంతం చేసుకునేలా జాగ్రత్త వహించటంలో ఈ సెంటర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
క్లాసిక్ లెజెండ్స్, దాని డీలర్ నెట్వర్క్ వ్యాప్తంగా సాంకేతిక శ్రేష్ఠతను పెంపొందించేందుకుగాను, అధునాతనమైన మౌలికసదుపాయాలను మరియు స్థిరస్వరూపం కలిగిన సామర్ధ్యాన్ని, అడ్వాన్స్‌డ్ నేషనల్ ట్రెయినింగ్ సెంటర్ ఒక చోటుకు చేరుస్తుంది. అధునాతనమైన డయాగ్నోస్టటిక్ ఉపకరణాలు మరియు ప్రత్యేకమైన సర్వీస్ పరికరాలు కలిగిన ఒక ఆధునిక షోరూమ్, స్మార్ట్ తరగతి గదులు, ప్రత్యేకమైన ఇంజన్, ఎలక్ట్రికల్, సమస్యలను పరిష్కరించే ఆధునిక ల్యాబ్‌లు కలిగిన ఈ కేంద్రం, లెవెల్ 1 నుండి లెవెల్ 3 వరకు సమగ్రమైన లెర్నింగుకు సహకారాన్ని అందిస్తుంది. అధునాతనమైన డయాగ్నోస్టిక్స్, మూల కారణాల విశ్లేషణ, స్వయంగా తెలుసుకుని నేర్చుకునే నైపుణ్యాభివృద్ధిని సుసాధ్యం చేసేందుకు డిజైన్ చేయబడిన ఈ కేంద్రం, సాంకేతిక సామర్ధ్యాన్ని పెంపొందించటంలో, సర్వీసును, రిపెయిర్ పద్ధతులను స్థిరీకరించటంలో, అత్యధిక నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లను, సర్వీసు ప్రొఫెషనళ్ళను తీర్చిదిద్ధటంలో, అధునాతనమైన లెవెల్ 3 శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించటాన్ని పటిష్టం చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.
దీనితో క్లాసిక్ లెజండ్స్, తన మోటార్‌సైకిళ్ళ పోర్ట్‌ఫోలియోల వ్యాప్తంగా అత్యుత్తమమైన ఓనర్‌షిప్ అనుభవాన్ని అందించేందుకు, పెరుగుతున్న తన రైడర్ల బేస్‌కు స్థిరమైన, అత్యంత నాణ్యమైన, విశ్వసనీయమైన విక్రయానంతర సహకారం లభించటం కొనసాగేలా జాగ్రత్త వహించటం ద్వారా, తన సర్వీస్ సామర్ధ్యపు ఈకోవ్యవస్థను పటిష్టపరుచుకుంటుంది.