1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. New Rs 1,000 note with temple design? PIB Fact Check debunks viral claim

త్వరలో కొత్త రూ.1000 నోటు? పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఏం చెబుతోంది?

new currency note
గతంలో నిషేధించిన రూ.1000 కరెన్సీ నోటును తిరిగి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. కొత్తగా రూ.1000 నోటు విడుదలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదని వెల్లడించింది. 
 
ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో పసుపు రంగులో ఉన్నట్టు కనిపించే రూ.1000 నోటు చిత్రాలు వైరల్ అయ్యాయి. కొత్త నోటును ఇప్పటికే విడుదల చేశారని మరికొందరు నిర్ధిష్ట తేదీన అందుబాటులోకి తీసుకుని రానుందంటూ ప్రచారం చేశారు. దీంతో కొత్త నోటు వస్తుందా? అంటూ నెటిజన్లలో చర్చమొదైలైంది. 
 
ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది. కొత్త రూ.1000 నోటు విడుదలైందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు అని పేర్కొంది. ఇలాంటి వార్తలను నమ్మే ముందు అధికారి సమాచారాన్ని పరిశీలించాలని, నిర్ధారణ కాని పోస్టులను ఇతరులకు షేర్ చేయొద్దని ప్రజలకు సూచన చేసింది. 
 
ప్రస్తుతం దేశంలో ఆర్.బి.ఐ. మహాత్మా గాంధీ సిరీస్‌లో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 కరెన్సీ నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. 2016 నవంబరు 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించినపుడు అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లు చట్టబద్ధమైన చెల్లింపుల హోదాను కోల్పోయాయి. అనంతరం కొత్త డిజైన్‌తో రూ.500 నోటును ప్రవేశపెట్టాయి. అయితే, రూ.1000 నోటును తిరిగి చెలామణిలోకి తీసుకునిరాలేదు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నీటి సంక్షోభం.. బాలల హక్కులకు పెను సవాలు!