1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. SBI ATM rules from October 1, 2026: Key changes customers should know

అక్టోబరు నుంచి కీలక మార్పులు.... గ్యాస్ సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ తప్పనిసరి!!

sbi atm
అక్టోబరు ఒకటో తేదీ నుంచి అనేక అంశాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. యూపీఐ, పన్నుల విధానాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, ఎల్పీజీ, ఎస్బీఐ ఏటీఎం నిబంధనల్లో కూడా చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా, బ్యాంకింగ్, పన్నులు, పొదుపు పథకాలు, వంటగ్యాస్ వంటి అనేక రంగాల్లో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి.ఇవి సామాన్య ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 
 
ఈ మార్పులలో ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)కి సంబంధించి కొత్త నిబంధన అమల్లోకి వస్తోంది. రూ.2,000 మించిన వ్యాపార (మర్చంట్) లావాదేవీలపై కొత్త 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (ఎండీఆర్) ఫ్రేమ్ వర్క్స్‌ను వర్తింపజేయనున్నారు. అయితే, ఈ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయబోరని, వ్యక్తిగత లావాదేవీలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టతనిచ్చారు.
 
మరోవైపు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట కల్పించింది. 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి గాను, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలు గడువును అక్టోబరు 21కి, ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ గడువును నవంబరు 21కి పొడిగించింది.
 
గృహ వినియోగదారులకు సంబంధించి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌లో కీలక మార్పు రాబోతోంది. అక్టోబరు 1 నుంచి సబ్సిడీ ధరపై గ్యాస్ సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు మార్కెట్ ధరకు సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
 
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా తన నిబంధనలను సవరించింది. శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అందించే నెలవారీ ఉచిత లావాదేవీల సంఖ్యను 10 నుంచి 5కి తగ్గించింది. ఈ పరిమితి ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు రెండింటికీ వర్తిస్తుంది. 'బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్' (బీఎన్బీడీ) ఖాతాలకు నెలకు నాలుగు ఉచిత నగదు విత్ డ్రాలు కొనసాగుతాయి. ఆ తర్వాత చేసే ప్రతి విశ్రాపై రూ.15తో పాటు జీఎస్టీతో పాటు వసూలు చేస్తారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భగవంత్ కేసరికి తర్వాత బాహుబలిపై పడిన ఇరాన్.. ఎందుకంటే?