1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Tesla Roadster Reservations Open in India, Thrust Version Requires Rs 2.50 Crore

భారత్‌లో టెస్లా కార్ల బుకింగ్స్ ప్రారంభం.. థర్డ్ వేరియంట్‌ ధర రూ.2.50 కోట్లు?

Tesla Car
భారత్‌లో టెస్లా కార్ల బుకింగ్ ప్రారంభమయ్యాయి. రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ కార్లను తొలుత బుక్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. అయితే, ఈ కారును సొంతం చేసుకోవాలనుకునేవారు భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి వుంటుంది. పెర్ఫార్మెన్స్ వేరియంట్ కోసం మొత్తం రూ.50.60 లక్షలు, థర్డ్ వేరియంట్ కోసం సుమారు రూ.2.50 కోట్లు చెల్లించాల్సివుంటుంది. అయితే, భారత్‌లో ఈ కార్ల డెలివరీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంపై టెస్లా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 
 
పెర్ఫార్మెన్స్ వేరియంట్ బుకింగ్ కోసం తొలుత రూ.5.01 లక్షలు చెల్లించాలి. ఆ తర్వాత 10 రోజుల్లో మరో రూ.45.05 లక్షలు చెల్లించాల్సి వుంటుంది. దీంతో మొత్తం రూ.50.06 లక్షలకు చేరుకుంది. థర్ట్ వేరియంట్ కోసం మొదట రూ.0501 లక్షలు చెల్లించాలి. ఆ తర్వాత పది రోజుల్లో రూ.2,45,24,000 చెల్లించాల్సి వుంటుంది. దీంతో ఆ కారు మొత్తం ధర రూ.2,50,25,000 అవుతుంది. 
 
బుకింగ్స్ కోసం తొలుత చెల్లించే రూ.5.01 లక్షలను పూర్తిగా తిరిగి చెల్లిస్తామని టెస్లా పేర్కొంది. అయితే, మొత్తం చెల్లింపు పూర్తయిన తర్వాత రిజర్వేషన్ ఖరారు అవుతుంది. పది రోజుల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోతే బుకింగ్ రద్దయ్యే అవకాశం ఉఁది. థర్డ్ వేరియంట్‌కు ఒక కస్టమర్ ఒక ఆర్డర్ మాత్రమే చేయాలని, స్థానిక చట్టాలు నియంత్రణ నిబంధనల ఆధారంగా థ్రస్టర్ సదుపాయం అందుబాటులోకి ఉండకపోవచ్చని కంపెనీ తెలిపింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రారంభ ముహూర్తం ఫిక్స్..