ఆ ఒక్క రూపాయి నోటు మీ దగ్గర ఉంటే...రూ.7 లక్షలు సంపాదించవచ్చు.. ఎలా..?
One Rupee
ఈ రూపాయి నోటును కేంద్ర ప్రభుత్వం 26 ఏళ్ల కిందటే ముద్రించడం ఆపేసింది. ఐతే... 2015లో మళ్లీ రూపాయి నోట్ల ముద్రణ ప్రారంభమైంది. కొత్త నోట్లు కొత్త కలర్‌తో మార్కెట్‌లోకి వచ్చాయి. ఐతే... స్వాతంత్ర్యానికి పూర్వపు రూపాయి నోటు మీ దగ్గర ఉంటే... మీరు రూ.7 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. మీ దగ్గర అలాంటి పురాతన నోట్లు ఉంటే... వాటిని మీరు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో వేలానికి పెట్టి... లక్షలు సంపాదించవచ్చు.
స్వాతంత్ర్యానికి పూర్వం 1935లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం గవర్నర్ జే డబ్ల్యూ కెల్లీ సంతకంతో... కొద్దిపాటి రూపాయి నోట్లను ముద్రించింది. ఆ నోట్లకు ఇప్పుడు ఈబే (eBay)లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి నోట్లు మీ దగ్గర ఉంటే... మీరు వాటిని లక్షలకు అమ్ముకోవచ్చు. ఈబేలో మాత్రమే కాదు... ఇంకా చాలా వెబ్‌సైట్లు ఉన్నాయి. వీటిలో పాత నోట్లు, నాణేలను అమ్ముకోవచ్చు.
