1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. Inter Marks Improvement Exams in Telangana state from 15th

ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు

Inter
తెలంగాణా రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటర్ రాత పరీక్షలు నిర్వహిచనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 74 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనల నడుమ పరీక్షలు జరుగనున్నాయి. 
 
ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులు చేస్తూ ఈ ఏడాది జూన్‌ 24న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా జిల్లాలో 53 వేల మంది పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. అయితే, కొందరు విద్యార్థులు మార్కుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. 
 
ఇలాంటి విద్యార్థులు ఇంప్రూమెంట్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించారు. వీరి కోసం ఈ నెల 15 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు తొలి ఏడాదికి, మధ్యాహ్నం  2.30 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరానికి పరీక్షలు జరుగనున్నాయి. 
తర్వాతి కథనం
భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన భర్త.. ఎక్కడ?