శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (08:50 IST)

నేడు యాదాద్రి క్షేత్రానికి సీఎం కేసీఆర్ - ఆలయ తుదిదశ పనుల పరిశీలన..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రదర్శనకు వెళ్లనున్నారు. ఈ ప‌ర్యటన‌లో భాగంగా యాదాద్రి ప్రధాన ఆలయ తుదిదశ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. 
 
అలాగే, ఈ నెల 17వ తేదీన మరోసారి చిన్న జీయర్ స్వామితో కలిసి యాదాద్రిలో పర్యటించనున్నారు. అయితే, ఈ ఏడాది అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ మాసాల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవ‌కాశం ఉందని సమాచారం. 
 
ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్యట‌న‌కు వెళ్లిన సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆల‌య ప్రారంభోత్సవానికి రావాల‌ని ప్రధాని మోడీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే.. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.