గ్రీన్ పొటాటో వేఫర్స్
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... అరకేజీ
పుదీనా ఆకులు... ఒక కట్ట
బియ్యం పిండి... నాలుగు టీస్పూన్లు
ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
పుదీనా ఆకులను శుభ్రం చేసుకుని మెత్తగా రుబ్బి పేస్ట్ లాగా చేసుకోవాలి. బంగాళాదుంపలకు తోలు తీసి రెండంగుళాల పొడవు ఉండేలాగా... బాగా పల్చగా, సన్నగా, పొడుగాటి ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ఉప్పు నీటిలో ఓ పదినిమిషాల పాటు నానబెట్టి నీరు వంపేసి, ఒక పొడి బట్టపైన ఆరబోయాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో పుదీనా పేస్ట్, బియ్యం పిండి వేసి.. అందులోనే బంగాళాదుంప ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. బంగాళాదుంప ముక్కలకు పుదీనా, బియ్యం పిండి బాగా పట్టిలా చూడాలి. నాన్‌స్టిక్ పాన్ స్టవ్‌పై పెట్టి వేడయ్యాక తగినంత నూనె పోసి, బంగాళా దుంప ముక్కలను అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే గ్రీన్ పొటాటో వేఫర్స్ రెడీ అయినట్లే...!