స్పానిష్ రైస్
|
బియ్యం... ఒకటిన్నర కప్పు
టొమోటోలు... మూడు
క్యాప్సికమ్... రెండు
క్యారెట్లు... 100 గ్రాములు
బీన్స్... 100 గ్రాములు
పచ్చిబఠాణీ... 50 గ్రాములు
బంగాళాదుంపలు... రెండు
ఉల్లిపాయ... ఒకటి
చీజ్ తురుము... 100 గ్రాములు
పచ్చిమిర్చి పేస్ట్... రెండు టీస్పూన్లు
వెన్న... ఒక టీస్పూన్
వెల్లుల్లి రేకలు... 12
ఎండుమిరపకాయలు... నాలుగు
పెరుగు... ఒక కప్పు
నూనె లేదా నెయ్యి... రెండు టీస్పూన్లు
గరంమసాలా... ఒక టీస్పూన్
మిరియాలపొడి... ఒక టీస్పూన్
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
బియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పైన చెప్పిన కూరగాయలన్నింటినీ ముక్కలుగా తరిగి ఉంచాలి. నూనె వేడి చేసి ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి. అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి ముద్ద కూడా వేసి మూడు నిమిషాలపాటు వేయించాలి.
దీంట్లోనే పెరుగు, కూరగాయల ముక్కలు, గరంమసాలా, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలిపి కొంతసేపు వేయించాలి. ఆ తరువాత ఉడికించి పెట్టుకున్న అన్నం, చీజ్ తురుము వేసి 15 నిమిషాలపాటు ఉడికించాలి. దించేముందు జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయండి.
