1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. 58 CRPF jawan died of COVID-19 so far

జవాన్లకు కరోనా.. ఒక్క రోజే 82మందికి కోవిడ్ పాజిటివ్.. 58 మంది మృతి

CRPF jawan
కరోనాకు తర్వాత అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కోవిడ్ విజృంభణకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. పేద ధనిక తేడా లేకుండా.. సామాన్య ప్రజలు, సెలబ్రెటీలనే బేధం లేకుండా కరోనా సోకుతోంది. తాజాగా సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు (సీఆర్‌పీఎఫ్) విభాగంలో కరోనా మహమ్మారికి తెరపడటం లేదు. దేశంలోని పలు సీఆర్‌పీఎఫ్ యూనిట్లలో ఒక్క బుధవారం రోజే కొత్తగా 82 మందికి కరోనా వైరస్ సోకడంతో జవాన్లు ఆందోళన చెందుతున్నారు. 
 
కరోనా వల్ల ఇప్పటివరకు 82 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 234 మంది కరోనా రోగులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోని అన్ని సీఆర్‌పీఎఫ్ యూనిట్లలో 11,072 మందికి కరోనా సోకగా, వారిలో 9,416 మంది కోలుకున్నారు. మరో 1598 మంది సీఆర్‌పీఎఫ్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండి చికిత్స పొందుతున్నారు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
హత్రాస్ తరహాలో యూపీలో ఘోరం.. మత్తు మందిచ్చి అత్యాచారం.. కాళ్లు విరిచి రిక్షాలో..?