సంబంధిత వార్తలు
- మహారాష్ట్ర విద్యాశాఖా మంత్రికి కరోనా పాజిటివ్
- డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలతకు కరోనా..
- ప్రియుడితో ముద్దూముచ్చట్లు... స్టార్ హీరోయిన్‌కు కరోనా వైరస్!? (video)
- ఐదు నెలల తర్వాత పట్టాలెక్కిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు మాత్రం నిల్!!
- జ్వరం ఉంటే నో ఎంట్రీ... హైదరాబాద్ మెట్రో జర్నీకి గైడ్‌లైన్స్..
మెట్రో రైలు సిబ్బందిని కూడా వదలని కరోనా.. 28 మందికి పాజిటివ్
కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా లాక్‌డౌన్ అనంతరం సెప్టెంబరు 7 నుంచి బెంగళూరు మెట్రో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో... అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ 28 మంది మెట్రో సిబ్బందికి కరోనా సోకింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్సీఎల్) అధికారి ఒకరు మీడియాకు ఈ విషయం తెలియజేశారు.
కరోనా బారిన పడినవారంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. కాగా కరోనాను కట్టడి చేసే ఉద్దేశంతో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలను నిలిపివేశారు. ఇటీవలే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో సేవలు ప్రారంభంకాగా, అక్టోబర్ 4 నుంచి కోల్‌కతా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా కోల్‌కతా మెట్రో అధికారి ఒకరు మాట్లాడుతూ అక్టోబరు 4 నుంచి తొలుత నావోపాడా- కవి సుభాష్ స్టేషన్‌ల మధ్య మెట్రోసేవలు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు.
