మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (19:42 IST)

ప్రియుడితో ముద్దూముచ్చట్లు... స్టార్ హీరోయిన్‌కు కరోనా వైరస్!? (video)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరాకు కరోనా వైరస్ సోకింది. తన ప్రియుడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన కొన్నిగంటల్లోనే ఈ అమ్మడుకు కూడా వైరస్ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీనికి కారణం... ఈ అమ్మడు ప్రియుడుతో ముద్దూ ముచ్చట్లలో మునిగితేలడమేనని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
తన అక్క మలైకా అరోరాకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు ఆమె చెల్లి నిర్ధారించారు. ఆ త‌ర్వాత మ‌లైకా కూడా ట్వీట్ చేసింది. "అవును, నాకు పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు. స్వీయ నిర్భందంలో ఉన్నాను. త్వ‌ర‌లోనే కోలుకొని మ‌ళ్ళీ మీ ముందుకు వ‌స్తా" అని చెప్పుకొచ్చింది. 
 
కొద్ది కాలంగా అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమ‌లో మునిగి తేలుతున్న విషయం తెల్సిందే. పెళ్ళి చేసుకునే విషయంలో పెద్దగా ఆస‌క్తి చూప‌ని ఈ జంట... సహజీవనం చేస్తూ భార్యాభర్తల్లా కలిసివుంటున్నారు. 
 
అయితే ఇద్దరికి ఒకే సారి కరోనా పాజిటివ్ వచ్చింది అంటే  వీరిద్దరు ఖచ్చితంగా ముద్దూముచ్చట్లలో మునిగితేలివుంటారని బాలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. కాగా, మలైకా కంటే వయసులో అర్జున్ కపూర్ చాలా చిన్నవాడు. అయినప్పటికీ ఈ స్టార్ హీరోయిన్ మాయలో పడి, తన సినీ కెరీర్‌ను అశ్రద్ధ చేశాడనే విమర్శలు లేకపోలేదు.