మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (17:15 IST)

తెలుగు బిగ్ బాస్-4లో కరోనా కలకలం ... ఇద్దరికి పాజిటివ్?

బుల్లితెరపై మంచి పాపులారిటీతో పాటు మంచి ప్రేక్షకాధారణం సొంతం చేసుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో నాలుగో సీజన్ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. ఈ నాలుగో సీజన్‌కి టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జు ప్రధాన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 
 
మరోవైపు ఈ సీజన్‌లో పాల్గొనే 16 మంది కంటెస్టెంట్‌లను ఇప్పటికే ఎంపిక చేశారు. అయితే, వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. వీరిలో యూట్యూబర్ గంగవ్వతో పాటు ఒక సింగర్ కూడా ఉన్నట్టు సమాచారం. 
 
దీంతో బిగ్ బాస్ టీమ్ ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఇంకోవైపు ముందుగానే ఎంపిక చేసిన ఎక్స్‌ట్రా కంటెస్టెంట్‌లతో వీరు ముగ్గురినీ రీప్లేస్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనేవారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉంచిన విషయం తెల్సిందే.