సంబంధిత వార్తలు
- దేశంలో పెరుగుతున్న కేసులు - రికవరీ రేటు .. తగ్గుతున్న మరణాలు...
- బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిచేసిన కేంద్రం - బస్సులు నడపమన్న సీఎం జగన్
- శృంగారంలో ముద్దులు పెట్టుకోవాలంటే.. మాస్కులు ధరిస్తే మంచిది...
- చికెన్ తింటే కరోనా మాయమంటూ ప్రచారం.. కొండెక్కిన ధరలు!
- ఏపీలో శాంతించని కరోనా వైరస్ : కొత్తగా పది వేల కేసులు
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌కు కరోనా
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిర్ధారించారు. తనకు కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
అయితే, ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉందని తెలిపారు. వైద్యులు, డాక్టర్లు, అధికారుల సూచన మేరకు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. మీ మద్దతు కోసం ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
రాబోయే రోజుల్లో తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వెల్లడిస్తానని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చారు.
