శృంగారంలో ముద్దులు పెట్టుకోవాలంటే.. మాస్కులు ధరిస్తే మంచిది...
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇపుడు జనం ముఖానికి మాస్కులు ధరించాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. అయితే, ఏకాంత సమయంలో భార్యాభర్తలు, ప్రేమికులు, శృంగార ప్రియులు మాస్కులు ధరించడం పెద్ద అడ్డంకిగా మారింది. ముఖానికి మాస్కులు ధరించి శృంగారంలో పాల్గొనడం పట్ల చాలా దాపంత్య అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఇలా చేయడం ఇష్టంలేని అనేక మంది మాస్కులు లేకుండానే శృంగారంలో పాల్గొంటూ ముద్దూ ముచ్చట్లలో మునిగితేలుతున్నారు.
దీనిపై కెనడా ప్రభుత్వ ఆరోగ్య అధికారి డాక్టర్ థెరిస్సా టామ్ స్పందిస్తూ, శృంగార సమయంలో మాస్క్ ధరించాలని సూచించారు. బయటి వ్యక్తులతో శృంగారం చేయాలనుకున్న సమయంలో మాస్క్ ధరించాలని ఆమె అన్నారు. ముద్దులు పెట్టుకోవడం మానేస్తే చాలా మంచిదన్నారు.
కోవిడ్19 వేళ శారీరకంగా దగ్గర అయ్యే సందర్భాలను దూరం పెట్టాలన్నారు. వైరస్ వ్యాప్తిని, సంక్రమణను అడ్డుకోవాలంటే ఇదొకటే సూత్రమన్నారు. వాస్తవానికి మహమ్మారి వేళ శృంగారాన్ని నివారించేడమే ఉత్తమ మార్గం అని ఆమె తెలిపారు. శృంగార వేళ మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఆమె చెప్పారు.
ప్రస్తుతం ఉన్న నివేదికల ఆధారంగా.. శృంగార సమయంలో ఊరే ద్రవాల ద్వారా కోవిడ్19 వ్యాపిస్తుందన్న సాక్ష్యాలు ఏమీ లేవన్నారు. కానీ కొత్త భాగస్వాములతో శృంగారంలో పాల్గొంటే.. అప్పుడు వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్ థెరిసా చెప్పారు. ప్రేమికులు కూడా కిస్సులు ఇచ్చుకోవడం ఆపాలన్నారు. సురక్షితమైన శృంగారాన్ని కొనసాగించాలంటే కండోమ్‌లు వాడాలని ఆమె సూచించారు.