సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: బుధవారం, 26 ఆగస్టు 2020 (13:17 IST)

క్లినికల్ కెమికల్ ఫ్యూమ్ రెస్పిరేటరీ మాస్క్ ప్రత్యేకతలు ఏమిటి?

మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని చూస్తే విచిత్రంగా చూస్తాము. పదేళ్ల క్రితం స్వైన్ ప్లూ వ్యాధి వచ్చినప్పుడు ఆస్పత్రులు, విమానశ్రయాలు వద్ద మాస్క్ సర్జికల్ మాస్క్ వాడేవారు. వీటిని అందరూ పూర్తి స్థాయిలో వాడేవారు కాదు.ఇక కరోనా పుణ్యమా అని అందరూ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిలోనూ రకరకాల మాస్కులు, క్లాత్ మాస్క్, సర్జికల్ మాస్క్, ఎన్ -95 మాస్క్, కొత్తగా క్లినికల్ ప్యూమ్ రెస్పిరేటరీ మాస్క్ ,దీని ధర ఎక్కువగా ఉంటున్నా, సేప్టీ విషయంలోనూ మరింత ముందుంది.
 
ఇలాంటి రెండు ఫిల్టర్లున్న కొత్తం రకం మాస్క్‌తో విశాఖపట్నం లోని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ధరించారు. హాఫ్ ఫేస్ పీస్‌గా పిలిచే ఈ మాస్క్ అసలు పేరు క్లినికల్ కెమికల్ ఫ్యూమ్ రెస్పిరేటరీ మాస్క్. దీన్ని ధరించడంలో కొంత అసౌకర్యం ఉన్నా పూర్తి రక్షణాత్మకమైందని సుధాకర్ తెలిపారు.
 
దీనికి రెండు వైపులా ఉన్న ఫిల్టర్లను నెల రోజుల పాటు ఏకధాటిగా వాడొచ్చు. నెల రోజుల తర్వాత కొత్తవి అమర్చుకోవాలి. అమెరికా నుంచి సన్నహితులు పంపారని, దేశీయ మార్కెట్టులో దీని ధర రూ. 6 వేలు వరకు ఉంటుందని డాక్టర్ సుధాకర్ తెలిపారు.