శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Updated : గురువారం, 16 జులై 2020 (11:26 IST)

ఇలా మాస్కులు లేని రోజు మళ్లీ ఎప్పుడొస్తుందో? గణపతి విగ్రహాల తయారీపై కరోనావైరస్ తాకిడి

గణపతి విగ్రహాలపై కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. కరోనా భయంతో విగ్రహాలు అమ్ముడు పోతాయో లేదోనని చాలా చోట్ల విగ్రహాల తయారీ నిలిచిపోయింది. గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఉంటుందో లేదోనన్న సందేహం నెలకొంటున్నది. పరిస్థితి ఇలా కొనసాగితే ఏడాది పాటు తాము కష్టాలు పడక తప్పవని కళాకారులు వాపోతున్నారు. వీటిపై  ఆధారపడి జీవనం కొనసాగించే కళాకారుల జీవన విధానం అగమ్యగోచరంగా మారింది.
 
బోనాల పండుగ తర్వాత అత్యంత వైభవంగా జరుపుకునేది వినాయక చవితి. దీంతో గణనాధుడు పది, పదకొండు రోజులు వీధివీధిన పూజలందుకుంటాడు. భక్తులు విభిన్న ఆకృతులలో విగ్రహాలను తయారు చేస్తుంటారు. ఇందుకోసం మూడు నెలల ముందే ఆర్డర్లు ఇచ్చి తయారు చేసుకుంటారు.
 
భాగ్యనగరంలో అధిక సంఖ్యలో విగ్రహాలు తయారవుతుంటాయి. ఆ ప్రదేశంలో నివశించే ప్రజలు విగ్రహాల తయారీపై ఆధారపడి జీవనాన్ని గడుపుతారు. అయితే కరోనా కారణంగా ఇప్పటివరకు పది ఆర్డర్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.