సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Updated : గురువారం, 16 జులై 2020 (18:18 IST)

వైరల్ వ్యాధులు: పరగడుపున 5 వేపాకులు, 5 మిరియాలు కలిపి... (video)

వేపచెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ప్లూ వంటి వైరల్ వ్యాధులు రాకుండా ఒక వారం పాటు రోజూ ఉదయం పరగడపున 5 వేపాకులు, 5 మిరియాలు కలిపి మింగాలి లేదంటే వాటిని మెత్తగా దంచి చిన్నచిన్న గోళీల్లా చేసి మింగేయవచ్చు. ఇలా చేయడం వల్ల సంవత్సరం పాటు వైరల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
 
అలాగే కొందరు చుండ్రుతో విపరీతంగా బాధపడుతుంటారు. అలాంటివారు వారానికి రెండుసార్లు 250 మి.లీ నీటిలో 25 వేపాకులు ఓ టీ స్పూన్ పసుపు కలిపి 50 మి.లీటర్ల నీళ్లు మరిగేలా చేసి దించి చల్లార్చి వడగట్టి తలంతా మాడుకు అంటేటట్లు పట్టించి గంట లేదా రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రును వదిలించుకోవచ్చు. 
 
ఇక ఈ వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే మరో సమస్య జలుబు. దీనికి 30 గ్రాముల వేపాకు, 15 గ్రాముల మిరియాల పొడి కలిపి తగినంత స్వచ్ఛమైన నీరు చేర్చి మెత్తగా నూరి చిన్న శనగలంత మాత్రలను చేసి ఎండబెట్టి నిల్వ వుంచుకుని పూటకి 1 నుంచి 2 మాత్రలు చొప్పున రెండు లేదా మూడు పూటలా గోరువెచ్చటి నీటితో సేవిస్తుండాలి. ఇలా చేస్తే జలుబు దరిదాపుల్లోకి రాదు.