వేపనూనె ఉపయోగిస్తే అవన్నీ మటాష్
కొన్ని మొండి వ్యాధులను నయం చేసే గుణం వేపకు వుంది. వేప చెట్టు, వేపాకులు, వేపగింజలు.. ఇలా వేపకు చెందిన అన్నిరకాలు ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు వైద్యులు. వేప గింజల్లోనుంచి నూనెను తీస్తారు. దీన్ని కడుపులోకి కూడా తీసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అలాగే పైపూతగా కూడా ఈ నూనెను పూయవచ్చని అంటున్నారు.
స్ఫోటకం, పొంగులాంటి వైరస్ వల్ల వచ్చే చర్మ వ్యాధులకు వేపనూనెని చర్మం అంతటా పూస్తే ఉపశమనం కలుగుతుందని వైద్యులు తెలిపారు.
గజ్జి, తామర, దురదలు, దద్దుర్లు వ్యాపిస్తే కూడా వేపనూనె మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సొరియాసిస్ వ్యాధితో బాధపడుతుంటే వేపనూనెతో మర్దన చేస్తే పొక్కులు మెత్తబడుతాయని వైద్యులు పేర్కొన్నారు.
చుండ్రుతో బాధపడేవారు రోజూ తలకు వేపనూనెను దట్టించి ఉదయం తలస్నానం చేస్తే మంచిదంటున్నారు వైద్యులు. ఇంకా చర్మసౌందర్యం నిగనిగలాడాలంటే వేపనూనెతో శరీరం అంతా మర్దన చేసుకుని నలుగు పెట్టుకుంటే చర్మంలోని మృత కణాలు నశిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.